తక్కువ ధరలో వస్తున్న జియో 5జీ ఫోన్
- ధర రూ.10వేల లోపే ఉండే అవకాశం
- 6.6 అంగుళాల డిస్ ప్లే
- వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా
ముందు భాగంగా 6.6 అంగుళాల వాటర్ డ్రాప్ డిస్ ప్లే ఉండడాన్ని గమనించొచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. దీని ధర రూ.10,000 కంటే తక్కువే ఉంటుందని అంచనా. ఈ ఫోన్ లో మీడియాటెక్ డెమైన్సిటీ 700 లేదంటే యూనిసాక్ 5జీ చిప్ సెట్ ఉపయోగించొచ్చని తెలుస్తోంది. జియోకి గూగుల్ తో భాగస్వామ్యం ఉంది. కనుక ఈ ఫోన్ లో ప్రత్యేక ఓఎస్ (ప్రగతి ఓఎస్) ఏర్పాటు చేయొచ్చు. జియో కస్టమర్లకు ఆఫర్లపై ఫోన్ ను విక్రయించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది దీపావళి రోజున దీన్ని విడుదల చేయొచ్చని భావిస్తున్నారు.