కడపలో పట్టపగలే వైసీపీ కార్యకర్త దారుణహత్య
- జిమ్ నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాసులురెడ్డిపై కత్తితో దాడి
- బురఖాలో వచ్చి విచక్షణ రహితంగా పొడిచిన నిందితులు
- భూతగాదాలే కారణమని అనుమానం
ఈ ఉదయం జిమ్ నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాసులుపై బురఖా ధరించిన ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడిచేసి, విచక్షణ రహితంగా గాయపరిచారు. రక్తపు మడుగులో కుప్పకూలిన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.