Vijay devarakonda: అమెరికా వెళ్లాలని కలలు కనే నిరుద్యోగిగా విజయ్ దేవరకొండ!

  • పరశురామ్ తో విజయ్ దేవరకొండ మూవీ 
  • ఇద్దరి కాంబినేషన్లో రెండో సినిమా 
  • దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 
  • డాక్యుమెంటరీ డైరెక్టర్ గా హీరోయిన్
Kutumba Rao Movie Update

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న సినిమా ఇది. మృణాళిని ఠాకూర్ కథానాయికగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని సెట్స్ పైకి వెళ్లింది. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో అభిమానులలో ఆసక్తి ఉండటం సహజం. ఈ సినిమాలో ఆయన నిరుద్యోగిగా కనిపిస్తాడట. ఉద్యోగం కోసం అన్వేషిస్తూనే, ఎలాగైనా అమెరికా వెళ్లాలనే ఒక పట్టుదలతో ఉంటాడని అంటున్నారు. ఇక ఇదే సమయంలో హీరోయిన్ అమెరికాలో ఉంటుంది. 

ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం హీరోయిన్ అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం జరుగుతుంది .. అది కాస్త ప్రేమగా మారుతుంది. హీరో తన కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటాడట. అందువల్లనే ఈ సినిమాకి 'కుటుంబరావు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. 

More Telugu News