శునకాలకూ యోగా తెలుసు.. ఫన్నీ వీడియో
- ఐటీబీపీ సిబ్బంది యోగసనాలు
- వారితో కలసి పాల్గొన్న ఓ శునకం
- అది కూడా మధ్య మధ్యలో ఆసనాల ప్రదర్శన
అయితే, ఐటీబీపీ క్యాంప్ లో సిబ్బంది యోగసనాలు చేస్తుండగా, ఐటీబీపీకే చెందిన ఓ శునకం కూడా పాల్గొంది. పెద్దగా అరుస్తూ మధ్య మధ్యలో ఆసనాలు వేస్తూ అక్కడ సందడి చేసింది. దీని హడావుడి చూస్తుంటే ‘నేను కూడా చేస్తున్నాను చూశారా?’ అన్నట్టుగా ఉంది. ఐటీబీపీ డాగ్ స్క్వాడ్ లో ఇది కూడా ఒకటి. ‘‘బద్ధకస్తులైన మీ మానవులకే యోగా అవసరం కానీ, మా లాంటి జీవులకు కాదు’’ అంటూ ట్విట్టర్ యూజర్ ఒకరు కామెంట్ పెట్టడం గమనార్హం.