gangula kamalakar: రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తు గడువు పెంచడం లేదు: మంత్రి గంగుల

  • ఈ రోజు వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామని వెల్లడి
  • లబ్ధిదారులకు జులై 15వ తేదీన చెక్కుల పంపిణీ 
  • బీసీ రుణాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్య
Minister Gangula on Rs 1 lakh financial assistance

బీసీ కులవృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందించే రూ.1 లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువును పెంచడం లేదని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ రోజు వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు జులై 15వ తేదీన చెక్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. బీసీ రుణాల పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. ఈ ఆర్థిక సాయానికి సంబంధించి ప్రస్తుతానికి గడువు ముగిసినప్పటికీ, తిరిగి దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. రెండో విడత దరఖాస్తుల కోసం మరో గడువు తేదీ ఉంటుందన్నారు.

More Telugu News