Kusampudi Srinivas: ముదురుతున్న వివాదం.. పవన్ ను విమర్శించిన ముద్రగడపై జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి ఫైర్

Kusampudi fires on Mudragada Padmanabham
  • వపన్ ను తీవ్రంగా విమర్శిస్తూ లేఖ రాసిన ముద్రగడ
  • పవన్ ను, ఆయన కుటుంబాన్ని వైసీపీ నేతలు తిట్టినప్పుడు ఎందుకు స్పందించలేదన్న కూసంపూడి
  • ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలని హితవు
వీధి రౌడీలా మాట్లాడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖను రాసిన సంగతి తెలిసిందే. తన లేఖలో పలు అంశాలకు సంబంధించి పవన్ పై ముద్రగడ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు ముద్రగడ లేఖపై జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ మండిపడ్డారు. ముద్రగడ లేఖను తాము ఖండిస్తున్నామని చెప్పారు. 

పవన్ ను, ఆయన కుటుంబ సభ్యులను ద్వారంపూడితో పాటు పలువురు వైసీపీ నేతలు బూతులు తిట్టినప్పుడు ముద్రగడ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇతరులకు ప్రశ్నలు వేయడం, సలహాలు ఇవ్వడం ఆపేసి... మనమెంత బాధ్యతగా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలని హితవు పలికారు. 

పవన్ కు ముద్రగడ రాసిన లేఖను ఈ లింక్ www.ap7am.com/flash-news-774752/mudragada-padmanabham-letter-to-pawan-kalyan ద్వారా చూడండి.
Kusampudi Srinivas
Pawan Kalyan
Janasena
Mudragada Padmanabham
YSRCP

More Telugu News