Mudragada Padmanabham: వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు న్యాయం? 175 సీట్లలో పోటీ చేసినప్పుడే సీఎం అనే పదం వాడాలి: పవన్ కల్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ

Mudragada Padmanabham letter to Pawan Kalyan
  • పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలన్న ముద్రగడ  
  • తాట తీస్తా, చెప్పుతో కొడతా అంటున్నారని విమర్శ
  • ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలని... వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు సబబని లేఖలో ఆయన ప్రశ్నించారు. మీ ప్రసంగాల్లో తాట తీస్తా, నార తీస్తా, గుండు గీయిస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అంటూ పదేపదే అంటున్నారని... ఇప్పటి వరకు ఎంత మందిని ఇలా చేశారో చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు.

బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మీరు తరచూ అంటున్నారని... అలాంటప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని మీరు ఎలా అడుగుతున్నారో తనకు అర్థం కావడం లేదని ముద్రగడ అన్నారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడే నన్ను సీఎం చేయండి అనే పదం వాడాలే తప్ప... కలిసి పోటీ చేసేటప్పుడు మీరే సీఎం అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. 

పవన్ కు ముద్రగడ రాసిన లేఖ ఇదే:

  • Loading...

More Telugu News