మనవరాలిని చూడ్డానికి అపోలో ఆసుపత్రికి వచ్చిన చిరంజీవి.. వీడియో ఇదిగో!

Chiranjeevi family in Appolo hospital
  • తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
  • భార్య, కూతుళ్లతో కలిసి ఆసుపత్రికి వచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చారు. తల్లీబిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. మరోవైపు, తన మనవరాలిని చూడ్డానికి చిరంజీవి ఆసుపత్రికి వచ్చారు. మనవరాలిని చూసుకుని మురిసిపోయారు. చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, కూతుళ్లు సుష్మిత, శ్రీజ కూడా ఆసుపత్రికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Chiranjeevi
Ramcharan
Upasana

More Telugu News