తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు
- ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై ఈ మేరకు డీఏ పెరుగుదల
- పెంచిన డీఏ 2022 జనవరి నుండి అమల్లోకి
- 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
తాజా పెరుగుదలతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలుగనుంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ మంజూరు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడుతుంది. నెలకు రూ.81.18 కోట్ల భారం పడుతుంది. పెంచిన డీఏ ప్రకారం రూ.1380 కోట్ల ఎరియర్స్ చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.