rbi: ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు... ఎందుకంటే..!

  • మహేశ్ బ్యాంకు కేసులో ఆదేశాలు పాటించలేదని నోటీసులు
  • పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి గతంలో హైకోర్టు ఆదేశం
  • ఆదేశాలు అమలు చేయలేదని కోర్టుకెళ్లిన వాటాదారులు
  • జులై 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు
HC notices to RBI governor

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహేశ్ బ్యాంకు కేసులో ఆదేశాలు పాటించనందుకు గాను ఈ నోటీసులు జారీ అయ్యాయి. పాలనా వ్యవహారాలకు అధికారిని నియమించాలని గతంలో ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

కానీ ఆదేశాలు అమలు కాలేదని మహేశ్ బ్యాంకు వాటాదారులు కోర్టుకు వెళ్లారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ నేపథ్యంలో స్పందించిన న్యాయస్థానం కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. జులై 7వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 

More Telugu News