ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు.. అంబటి సహా అందర్నీ అభినందించిన జగన్

AP CM praises Ambati and officials for awards
  • నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో మూడో స్థానంలో ఏపీ
  • ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న అధికారులు
  • జలవనరుల శాఖపై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ కు నాలుగు జాతీయ జల అవార్డులు రావడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను సీఎం జగన్ అభినందించారు. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి అవార్డును అందుకున్నారు. మరోవైపు జలవనరుల శాఖపై జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్నకొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై కూడా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
YS Jagan
Ambati Rambabu

More Telugu News