Cricket: బెన్ స్టోక్స్ మాస్టర్ ప్లాన్​.. క్రికెట్ లో ఇలాంటి ఫీల్డింగ్​ సెటప్‌ని ఎప్పుడూ చూసుండరు!

  • ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా యాషెస్ తొలి టెస్టు
  • ఉస్మాన్ ఖవాజా వికెట్ కోసం అద్భుతమైన ఫీల్డింగ్ సెట్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్
  • బంతిని ఎటు ఆడాలో తెలియక బౌల్డ్ అయిన ఖవాజా
An unconventional field setup from England

చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ టెస్టు సిరీస్ లో మొదట మ్యాచ్ బర్మింగ్ హామ్ లో హోరాహోరీగా సాగుతోంది. ఈ మధ్య బజ్ బాల్ క్రికెట్ అంటూ ధనాధన్ బ్యాటింగ్ తో టెస్టు క్రికెట్ కు ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఇంగ్లండ్. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు.. తొలి రోజే మొదటి ఇన్నింగ్స్ ను 393/8 వద్ద డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియా కూడా దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయితే, ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ లో 386 పరుగుల వద్ద ఆలౌట్ అవగా.. ఇంగ్లండ్ కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. అయితే, బ్యాటింగ్ లో దూకుడుగా ఆడిన ఇంగ్లండ్.. బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ అదే పంథా అనుసరించింది. ముఖ్యంగా భారీ సెంచరీ చేసి జోరుమీదున్న ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సెట్ చేసిన ఫీల్డింగ్ విస్మయం కలిగిస్తోంది. 
.సాధారణంగా పేసర్లు బౌలింగ్ చేస్తుండగా.. ఎడ్జ్ లు వస్తాయని వికెట్ల వెనుక ఎక్కువ స్లిప్ ఫీల్డింగ్ పెడుతుంటారు. బ్యాటర్లు సాధారణంగా నాన్ స్ట్రయికర్  వైపు ‘వీ’ షేప్ (లాంగాన్, లాంగాఫ్) లేదా సెమీ సర్కిల్ మీదుగా బాల్ ను తరలించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఈ పోరులో స్టోక్స్ .. రివర్స్ వీ షేప్‌ లో ఫీల్డింగ్ సెట్ చేశాడు. స్లిప్‌ లో ఒక్కరిని కూడా ఉంచకుండా.. నాన్ స్ట్రయికర్ ఎడమ, కుడి వైపున ముగ్గురేసి చొప్పున ఆరుగురు ఫీల్డర్లను ఉంచాడు. బౌలర్ యార్కర్ వేయగా.. థర్డ్ మ్యాన్ దిశగా బంతిని ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫీల్డింగ్ సెట్ చేశాడంటూ అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
.

More Telugu News