జగన్ పై విమర్శలు గుప్పించిన సీపీఎస్ పోరాట సంఘాలు
- ఓపీఎస్ అమలుచేస్తామని పాదయాత్ర సందర్భంగా జగన్ హామీ ఇచ్చారన్న పోరాట సంఘాలు
- ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని అంగీకరించబోమని స్పష్టీకరణ
- జేఏసీ నేతలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
మరోవైపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని జగన్ చెప్పారని... ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోకుండా తమకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 6,667 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేయడం అన్యాయమని అన్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.