Remand Priosner: రిమాండ్ ఖైదీ తప్పించుకున్న ఘటనలో ఏడుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

  • ఈ నెల 15న పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ నాగిరెడ్డి
  • ధార్వాడ నుంచి నాగిరెడ్డిని పీటీ వారెంట్ పై తీసుకువచ్చిన పోలీసులు
  • నాగిరెడ్డిపై 30కి పైగా కేసులు
YSR Kadapa SP suspends 7 constables

ఓ రిమాండ్ ఖైదీ తప్పించుకున్న ఘటనలో ఏడుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. డీజీపీ ఆదేశాలతో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. రిమాండ్ ఖైదీ నాగిరెడ్డి ఈ నెల 15న పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. 

ఓ కేసులో నాగిరెడ్డిని ధార్వాడ నుంచి పీటీ వారెంట్ పై జిల్లాకు తీసుకువచ్చారు. జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచి తిరిగి తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన నాగిరెడ్డిపై 30కి పైగా కేసులు ఉన్నాయి. వాటిలో ఓ కిడ్నాప్ కేసు, పలు చోరీ కేసులు ఉన్నాయి.

More Telugu News