Bopparaju: ఈ 60 రోజుల్లో ఎన్ని హామీలు అమలు చేస్తారో చూస్తాం: బొప్పరాజు

  • విశాఖలో ఏపీ జేఏసీ అమరావతి జోన్-1 అభినందన సభ
  • హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు
  • ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని వెల్లడి
  • ఉద్యోగుల పోరాటాలను ఇతర ఉద్యమాలతో ముడిపెట్టడం సరికాదన్న బొప్పరాజు
  • ఏపీ జేఏసీ అమరావతి ఎప్పటికీ ఉద్యోగుల పక్షమేనని స్పష్టీకరణ
Bopparaju talks to media

విశాఖపట్నంలోని రెవెన్యూ సంఘ్ భవన్ లో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ 60 రోజుల్లో ప్రభుత్వం ఎన్ని హామీలు నెరవేరుస్తుందో చూస్తామని అన్నారు. ఎన్ని హామీలను మంత్రివర్గంలో పెట్టి అమలు చేస్తారో పరిశీలిస్తామని తెలిపారు. 

ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని... అయితే ఉద్యోగ సంఘాల పోరాటాలను రాజకీయ ఆందోళనలు, ట్రేడ్ యూనియన్లు, ఇతర ఉద్యమాలతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీ జేఏసీ అమరావతి ఎప్పటికీ ఉద్యోగుల పక్షమేనని బొప్పరాజు స్పష్టం చేశారు. ఉద్యోగుల కోసమే ఏపీ జేఏసీ అమరావతి పోరాడుతుందని పేర్కొన్నారు. 

ఇటీవల ఉద్యోగుల కోసం తాము చేసిన ఉద్యమం జయప్రదం అయిందని తెలిపారు. అయితే, తమపై విమర్శలు చేస్తున్నవారు ఈ 92 రోజుల ఉద్యమంలో తాము ఎక్కడ లొంగిపోయాయో, ఎక్కడ అమ్ముడుపోయామో చెప్పాలని బొప్పరాజు నిలదీశారు. ఉద్యోగుల సమస్యలపై వెనక్కి తగ్గిన నేతలే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ జేఏసీ అమరావతి జోన్-1 అభినందన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News