Cricket: ఆరు బంతులు, ఆరు వికెట్లు.. ఇంగ్లీష్ చిన్నారి అరుదైన రికార్డ్!

12 Year Old English Cricketer Hogs Limelight
  • సింగిల్ ఓవర్ లో డబుల్ హ్యాట్రిక్ 
  • కూక్‌హిల్ జ‌ట్టుపై ఈ ఫీట్ సాధించిన వైట్ హౌజ్
  • నమ్మశక్యంగా లేదంటూ ఆనందం
సింగిల్ ఓవర్ లో డబుల్ హ్యాట్రిక్ సాధించాడు 12 ఏళ్ల ఇంగ్లీష్ పిల్లాడు. అండ‌ర్ 12 టోర్నీలో ఒలివ‌ర్ వైట్‌హౌజ్ అనే చిన్నారి ఈ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్ల‌బ్‌కు చెందిన సదరు పిల్లాడు కూక్‌హిల్ జ‌ట్టుపై ఈ ఫీట్‌ను సాధించాడు.  

తాజాగా, ఈ నెలలో కుఖిల్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తరఫున బౌలింగ్ చేస్తూ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టిన ఈ ఇంగ్లండ్ కుర్రాడు చర్చనీయాంశంగా మారాడు. 12 ఏళ్ల జూనియర్ ఆటగాడు వైట్‌హౌస్.. కుక్‌హిల్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక ఓవర్‌లో డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఇది తనకే నమ్మశక్యంగా లేదని అతను బీబీసీతో అన్నాడు. 'ఇది నమ్మశక్యం కాకుండా ఉంది, ఎవరైనా బౌల్డ్ అయిన ప్రతిసారీ అతని స్నేహితులు అతనిని ప్రశంసిస్తున్నారు.. ఇది చాలా సంతోషంగా ఉందని' అతని తల్లి చెప్పింది.
Cricket

More Telugu News