Ram Gopal Varma: మీకు జామకాయల మాదిరిగా నాకు కాళ్ల టేస్టు ఇష్టం: రామ్ గోపాల్ వర్మ

RGV Interview
  • తాజా ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ 
  • ఆఫీసు బిల్డింగ్ కి డబ్బులెక్కడివనే ప్రశ్న పట్ల అసహనం 
  • దావూద్ ఇబ్రహీం ఇచ్చాడంటూ వ్యంగం 
  • తన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానని వ్యాఖ్య

రామ్ గోపాల్ వర్మ .. మనసులో ఏది అనుకుంటే బయటికి అది మాట్లాడేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ .. ఆ తరువాత ఎదురయ్యే విమర్శలను లైట్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆయన పోస్ట్ చేసే వీడియోలు, కామెంట్స్ ను కలుపుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వర్మ 'ఆర్జీవీ డెన్' పేరుతో కొత్త ఆఫీసును ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. 

తాజా ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో నా సినిమాలేవీ లాభాలు తేలేదు .. ఇంత పెద్ద ఆఫీసు బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అడుగుతున్నారు .. నాకు  దావూద్ ఇబ్రహీం ఇచ్చాడు" అంటూ సమాధానం ఇచ్చారు. నాకు ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? అంటూ ఎదురు ప్రశ్నించారు. 

అమ్మాయిల కాళ్లు నాకడమేమిటని అడుగుతున్నారు .. నాకు కాళ్ల టేస్టు అంటే ఇష్టం .. మీకు జామకాయలు అంటే ఎలా ఇష్టమో .. అలాగా. అయినా నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా .. నాకు నచ్చినట్టు చేస్తా అని ఇప్పటికి వెయ్యిసార్లు చెప్పాను. అయినా మళ్లీ ఎందుకండీ అవే ప్రశ్నలు అడుగుతారు?" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News