గాల్లోకి ఎగిరి రెప్పపాటులో పట్టేశాడు... బౌండరీ లైన్ వద్ద బ్రాడ్ కళ్లు చెదిరే క్యాచ్

Sussex Brad Currie Takes one of the best catch
  • హ్యాంపషైర్ హ్యాక్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో సస్సెక్స్ ప్లేయర్ బ్రాడ్ క్యాచ్
  • హ్యాంపషైర్ బ్యాటర్ సిక్సర్ కొట్టే ప్రయత్నం
  • డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న బ్రాడ్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన వైనం
ఇంగ్లండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్ లో హ్యాంపషైర్ హ్యాక్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో సస్సెక్స్ ఆటగాడు బ్రాడ్ క్యూర్రీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో హ్యాంపషైర్ బ్యాటర్ బెన్నీ హోవెల్ షాట్ కొట్టి సిక్సర్ కు ప్రయత్నించాడు. అయితే డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న బ్రాడ్.. బంతి దిశగా పరుగెత్తి దానిని అద్భుతంగా పట్టుకున్నాడు. దీంతో సస్సెక్స్ విజయం సాధించింది. కళ్లు చెదిరే క్యాచ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు బ్రాడ్ క్యూర్రీ. అతనిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది.
Go Back to Shorts
Cricket

More Telugu News