మళ్లీ బ్యాట్ పడుతున్న అంబటి రాయుడు
- అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ లో బరిలోకి
- టెక్సాస్ సూపర్ కింగ్స్ కు ఆడనున్న రాయుడు
- ఇటీవలే కెరీర్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
కాగా, సీఎస్కే ఆటగాళ్లయిన డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే కూడా మేజర్ లీగ్ క్రికెట్ లో టెక్సాస్ జట్టు తరఫున ఆడనున్నారు. ఈ జట్టుకు స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్గా వ్యవహరిస్తాడు. డేవిడ్ మిల్లర్, డేనియల్ సామ్స్ వంటి ఐపీఎల్ ఆటగాళ్లు బరిలో ఉన్న మేజర్ లీగ్ క్రికెట్ లో ఆరు జట్లు పోటీ పడనున్నాయి. జులై 14న జరిగే ప్రారంభ మ్యాచ్లో సూపర్ కింగ్స్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ తో తలపడనుంది.