Ram Gopal Varma: పవర్ స్టార్ కన్నీళ్లు పెట్టుకుని అడుక్కుంటున్నాడు: రామ్ గోపాల్ వర్మ

  • పవన్ కల్యాణ్ ను మరోసారి టార్గెట్ చేసిన ఆర్జీవీ
  • జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న పవన్ వ్యాఖ్యలపై సెటైర్
  • హీరోయిజం నుంచి జీరోయిజంకు పడిపోయాడని ఎద్దేవా
Pawan Kalyan is begging says Ram Gopal Varma

ఓవైపు ఏపీలో రాజకీయాలు వేడెక్కుతుంటే... మరోవైపు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తగ్గేదేలేదంటున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పిస్తున్న వర్మ... జగన్ జీవిత చరిత్రతో సినిమాను సైతం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తిగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీస్తున్నాడు.

మరోవైపు కాసేపటి క్రితం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పవర్ స్టార్ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుక్కుంటున్నాడని ఆర్జీవీ ఎద్దేవా చేశాడు. ఆయన కులం వ్యక్తులు, అభిమానుల గుండెల్లో హీరోయిజం నుంచి జీరోయిజంకు పవర్ స్టార్ పడిపోయాడని అన్నాడు. వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఈ మేరకు సెటైరికల్ ట్వీట్ చేశారు.

More Telugu News