బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజూ ఐటీ సోదాలు
- ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన ఐటీ
- దాడుల్లో 70 మందితో కూడిన అధికారుల బృందం
- రాజకీయ దురుద్దేశంతోనే సోదాలు చేస్తున్నారన్న నేతలు
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా రెడ్డిని ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారని సమాచారం. శేఖర్ రెడ్డి పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఐటి సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు మండి పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ సోదాలు చేయిస్తోందంటూ నేతలు ఆరోపిస్తున్నారు. తన వ్యాపారాలన్నీ తెల్లకాగితం వంటివని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.