Prabhas: సుకుమార్ బ్యానర్లో ప్రభాస్ అడ్వెంచరెస్ థ్రిల్లర్!

  • వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ 
  • ఆయనను ఒప్పించిన సుకుమార్
  • సొంత బ్యానర్లో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు 
  • ఆయన శిష్యుడే ఈ సినిమాకి డైరెక్టర్
Prabhas in Sukumar movie

సుకుమార్ ఒక వైపున దర్శకుడిగా తన సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగా కూడా వరుస హిట్లు అందుకుంటూ వెళుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ, యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తన బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాలకి తనే కథ .. స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండటం విశేషం. 

సుకుమార్ శిష్యులు దర్శకులుగా తమ సత్తా చాటుకుంటూ ముందుకు వెళుతున్నారు. వీళ్లంతా కూడా మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటూ ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్లో చేయడానికి హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. నిర్మాతగా ఇప్పటివరకూ ఓ మాదిరి హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన సుకుమార్, ఇప్పుడు ప్రభాస్ ను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. 

ఇటీవల ప్రభాస్ కి సుకుమార్ ఒక కథను వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. సుకుమార్ నిర్మించే ఈ సినిమాకి ఆయనే కథ.. స్క్రీన్ ప్లే .. మాటలు అందించనున్నాడని చెబుతున్నారు. సుకుమార్ శిష్యుడే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇది ఒక అడ్వెంచరెస్ థ్రిల్లర్ అనేది బలంగా వినిపిస్తున్న టాక్. 

More Telugu News