Vijay Devarakonda: పూజ హెగ్డే ప్లేస్ లో మృణాల్ ఠాకూర్!

  • పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 
  • పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా వార్తలు 
  • తాజాగా తెరపైకి వచ్చిన మృణాల్ పేరు 
  • దిల్ రాజు నిర్మిస్తున్న భారీ సినిమా ఇది 
  • రేపో మాపో సెట్స్ పైకి వెళుతున్న సినిమా  
Vijay Devarakonda movie update

వరుస ఫ్లాపులు ఎదురవుతున్నా పూజ హెగ్డే క్రేజ్ గానీ ... అవకాశాలు గాని తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ సినిమాలో మహేశ్ బాబు సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ జోడీగా కూడా ఆమెను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో మృణాల్ పేరు తెరపైకి వచ్చింది. 

'సీతారామం' సినిమాతో మృణాల్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. ఆ సినిమాలోని సీత పాత్ర అంతగా ఆమెకి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె నాని సరసన నాయికగా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. 

విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ ఒక సినిమా చేయనున్నాడు. రేపో మాపో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు పూజ హెగ్డేను అనుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందనేది తెలియదుగానీ, ఆ ప్లేస్ లో మృణాల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మృణాల్ చేతికి మరో పెద్ద ప్రాజెక్టు చిక్కిందన్న మాట. 

More Telugu News