Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 418 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 115 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన స్టాక్ మార్కెట్లు
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకుపోయాయి. ఆ తర్వాత చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 63,143కి పెరిగింది. నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకుని 18,716 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (2.15%), టైటాన్ (2.07%), ఐటీసీ (1.96%), రిలయన్స్ (1.50%), టాటా స్టీల్ (1.46%). 

టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-1.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.68%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.58%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ ఇండియా (-0.37%), టాటా మోటార్స్ (-0.34%).

More Telugu News