తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల తర్వాతే వాతావరణ మార్పు
- ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- ఇంకా ప్రారంభం కాని వర్షాలు
- మరో రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వడగాడ్పులు కొనసాగుతాయన్న ఐఎండీ
రెండ్రోజుల తర్వాత అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ దక్షిణ ప్రాంతంపై నైరుతి రుతుపవనాల ప్రభావం జూన్ 15 లేదా 16వ తేదీ నుంచి ఉంటుందని తెలిపింది.