Nara Lokesh: నాలో ఉన్నది కూడా సీమ రక్తమేరా సిల్లీ ఫెలోస్!: నారా లోకేశ్

  • బద్వేలులో యువగళం సభ
  • నారా లోకేశ్ వాడీవేడి ప్రసంగం
  • సవాల్ చేయాలంటే హిస్టరీ ఉండాలన్న లోకేశ్
  • తనను అడ్డుకోవాలంటే దమ్ము ఉండాలని వెల్లడి
  • వైసీపీ వాళ్లకు ఆ రెండూ లేవని ఎద్దేవా
Nara Lokesh powerful speech in Budvel

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప జిల్లా బద్వేలులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభలో నారా లోకేశ్ వాడీవేడిగా ప్రసంగించారు. బద్వేల్ జోష్ అదిరిపోయిందని, మట్లి రాజులు ఏలిన నేల బద్వేల్ అని పేర్కొన్నారు. మహానగరం అయ్యే శక్తి బద్వేలుకి ఉంది అని బ్రహ్మం గారు చెప్పారని వెల్లడించారు. 

శ్రీ కొండ గోపాలస్వామి దేవాలయం, చెన్నకేశవస్వామి దేవాలయం, కాశిరెడ్డి నాయన ఆలయం ఉన్న నేల బద్వేల్ అని వివరించారు. బద్వేల్ పెద్దాయన బిజివేముల వీరారెడ్డి గారు... కడప జిల్లాలో పసుపు జెండా ఎగరేసిన మొనగాడు... ఆయన రికార్డులు కొట్టే వారు ఎవరూ లేరు అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న బద్వేల్ గడ్డపై పాదయాత్ర చెయ్యడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 

"వైసీపీ నాయకులు నన్ను సీమలో అడుగుపెట్టనివ్వం అని సవాల్ చేశారు... కానీ నాలో ఉన్నదీ సీమ రక్తమేరా సిల్లీ ఫెలోస్..." అని లోకేశ్ ఘాటుగా జవాబిచ్చారు. సవాల్ చెయ్యాలంటే హిస్టరీ ఉండాలి... అడ్డుకోవాలి అంటే దమ్ముండాలి... ఆ రెండూ వైసీపీ నాయకులకు లేవని ఎద్దేవా చేశారు. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది... కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా? అడ్డొచ్చిన వైసీపీ సైకోలను సీమ సందుల్లో తొక్కుకుంటూ పోయాం అని వెల్లడించారు.

లోకేశ్ ప్రసంగం హైలైట్స్...

 124 రోజులు, 44 నియోజకవర్గాలు, 1587 కిలోమీటర్లు. సీమ గడ్డ పై యువగళం ఒక హిస్టరీ. 
 సీమ పౌరుషం ఏంటో తాడేపల్లి ప్యాలస్ కి చూపించాం. 
 సీమలో నన్ను ఆశీర్వదించిన ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.  
 సీమ జగన్ ని సీఎం చేసింది, సంపద ఇచ్చింది. 49 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది. 8 మంది ఎంపీలను ఇచ్చింది.  
 జగన్ సీమకి ఇచ్చింది ఏంటి? జగన్ సీమ బిడ్డ కాదు సీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ.
 సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, పేదలకు ఇళ్లు, రోడ్లు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది టీడీపీ. 
 బద్వేల్ గడ్డ పై నిలబడి సవాల్ చేస్తున్నా... సీమకు నువ్వు చేసింది ఏంటో చెప్పు... మేం చేసింది ఏంటో చెబుతాం... నేను చర్చకు సిద్ధం... ఎప్పుడు వస్తావో చెప్పు జగన్. 
 2019లో జగన్ కి ఇచ్చిన ప్రజాతీర్పు 2024 లో మాకు ఇవ్వండి. జగన్ కి ఇచ్చిన 49 సీట్లు మాకు ఇవ్వండి. సీమ సత్తా ఏంటో దేశానికి చూపిస్తాం. 
 సీమకు ఏం చేస్తామో మిషన్ రాయలసీమలో చెప్పాం. మిషన్ రాయలసీమ అమలు చేసి సీమని నిలబెడతాం. 
 ఒకవేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఇదే బద్వేల్ సెంటర్ లో చొక్కా పట్టుకొని నిలదీయండి.
 కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. 
 మహాశక్తి పథకం కింద... ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 
 పులకేశి జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు. 
  జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. 
 యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 
  నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. 
 టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. 




More Telugu News