Vijay Antony: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వారమే స్ట్రీమింగ్ కానున్న 'బిచ్చగాడు 2'

  • మే 19న థియేటర్స్ కి వచ్చిన 'బిచ్చగాడు 2'
  • తమిళ .. తెలుగు భాషల్లో భారీ వసూళ్లు 
  • హైలైట్ గా నిలిచిన అన్నాచెల్లెళ్ల ఎమోషన్స్
  • ఈ నెల 17వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
Bichagadu 2 movie will release in OTT on 17th June

విజయ్ ఆంటోని హీరోగా .. ఆయన దర్శక నిర్మాణంలో 'బిచ్చగాడు 2' సినిమా రూపొందింది. మే 19వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. విడుదల చేసిన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. భారీ వసూళ్లను రాబట్టుకుంది. 

తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా లాభాల బాటపట్టడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. కథాకథనాల పరంగా .. టేకింగ్ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా విజయ్ ఆంటోని మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అన్నా చెల్లెళ్ల ఎమోషన్స్ బలంగా ఉండటం వలన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, దేవ్ గిల్ .. జాన్ విజయ్ ... రాధారవి .. మన్సూర్ అలీ ఖాన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

More Telugu News