Revanth Reddy: వేలాదిమందికి భూములు పంచి పెట్టాం: రేవంత్ రెడ్డి

  • భూదాన్ భూములను ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చలేదని ఆగ్రహం
  • రంగారెడ్డి జిల్లాలోనే 15వేల ఎకరాల భూదాన్ భూములన్నాయని వెల్లడి
  • ఆ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు జరగకూడదని వెల్లడి
Revanth Reddy on Dharani lands

భూదాన్ భూములను ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేలాదిమంది రైతులకు భూములను పంచి పెట్టిందని, మండల వ్యవస్థ వచ్చాక భూరికార్డులు అన్నీ మండలాలకు బదలీ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు భూముల వివరాలను పారదర్శకంగా నమోదు చేసిందన్నారు. డిజిటలైజ్ చేయడానికి భూభూరతి పేరుతో పైలట్ ప్రాజెక్టును తీసుకు వచ్చామన్నారు.

రంగారెడ్డి జిల్లాలోనే పదిహేను వేల ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయన్నారు. ఇవన్నీ అసైన్డ్ భూములేనన్నారు. భూదాన్ భూములను కాపాడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలెక్టర్ కు లేఖ రాశారని తెలిపారు. కందుకూరు మండలం తిమ్మాపూర్ లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చామని, ఆ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు జరగకూడదన్నారు. ధరణి నిషేధిత జాబితాలో ఈ భూముల్లేవని, అన్నీ తొలగించినట్లు చెప్పారు.

More Telugu News