adipurush: హనుమంతుడి పక్క సీటుకు భారీ ధర అంటూ ప్రచారం .. వివరణ ఇచ్చిన ఆదిపురుష్ టీమ్!

Adipurush team clarity on big price on ticket
షార్ట్స్‌లో చూడండి
ఆది పురుష్ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ లో ఆంజనేయుడి కోసం ఓ సీటును ఖాళీగా వదిలి పెట్టనున్నారు. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటుకు హనుమంతుడు వస్తాడనే నమ్మకంతో ప్రతి థియేటర్లో ఓ సీటును ఖాళీగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రచారం సాగుతోంది. హనుమంతుడికి వదిలే సీటు పక్క సీటును భారీ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

దీనిపై ఆదిపురుష్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఆది పురుష్ టిక్కెట్స్ విషయంలో రకరకాల ప్రచారం సాగుతోందని, ఇందులో భాగంగా హనుమంతుడి పక్క సీటును భారీ ధరకు అమ్ముతున్నారని చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని, అన్ని సీట్లు ఏ ధరకు విక్రయిస్తున్నారో ఆ సీటు కూడా అంతకే విక్రయిస్తున్నట్లు తెలిపింది.
Go Back to Shorts
adipurush

More Telugu News