యూపీ బీజేపీ నేత హత్య.. భార్య అరెస్ట్
- పశ్చిమ యూపీ బీజేవైఎం సోషల్ మీడియా ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న గార్గ్
- గార్గ్ ఛాతీలోకి దూసుకుపోయిన బుల్లెట్
- గార్గ్ భార్యకు జ్యుడీషియల్ కస్టడీ విధింపు
తన భర్త తనను నాటు తుపాకీతో కాల్చాలనుకున్నాడని... ఆ క్రమంలో జరిగిన కొట్లాటలో తుపాకీ ఒక రౌండు పేలి తన భర్త ఛాతీలోకి దూసుకెళ్లిందని విచారణలో సోనియా చెప్పినట్టు పోలీసు అధికారి తెలిపారు. శనివారం ఉదయం తన భర్త ఆత్మహత్యకు కూడా యత్నించాడని తెలిపారని అన్నారు. శుక్రవారం రాత్రి విపరీతంగా తాగి తనను కొట్టాడని చెప్పారని అన్నారు. హత్యా స్థలిలో తొలుత పిస్టల్ కనిపించలేదని... దాని గురించి విచారణలో సోనియాను ప్రశ్నించగా ఒక అల్మరా నుంచి పిస్టల్ తో పాటు గార్గ్ మొబైల్ ను కూడా తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పారు. మృతుడు గార్గ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ బీజేపీ యువమోర్చా సోషల్ మీడియా ఇన్చార్జీగా వ్యవహరిస్తున్నారు.