Priyanka Gandhi: మధ్యప్రదేశ్ పై కాంగ్రెస్ గురి.. వర్క్ స్టార్ట్ చేసిన ప్రియాంకాగాంధీ

  • జబల్ పూర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంక
  • నర్మదా నదికి పూజలు చేసి భారీ ర్యాలీ నిర్వహణ
  • మూడేళ్లలో మధ్యప్రదేశ్ కు బీజేపీ చేసిందేమిటని ప్రశ్న
Priyanka Gandhi started election campaigning in Madhya Pradesh

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది చివర నాటికి జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీని ప్రియాంకగాంధీ ఈరోజు ప్రారంభించారు. జబల్ పూర్ లో నర్మదానదికి పూజలు చేసిన అనంతరం ఆమె పెద్ద ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంకతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, ఇతర కీలక నేతలు ఉన్నారు. 

ఈ సందర్భంగా ప్రియాంక ప్రసంగిస్తూ... గత మూడేళ్లలో మధ్యప్రదేశ్ కు బీజేపీ చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో తమ జీవితం బాగుపడిందని ఇక్కడున్న ఒక్కరైనా చెప్పగలరా అని అడిగారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీకి చెంపపెట్టు అని అన్నారు. 

మరోవైపు 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టుకుపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

More Telugu News