Siddharth: 'టక్కర్' మూవీ మండే టాక్!

  • ఈ నెల 9న విడుదలైన 'టక్కర్'
  • సిద్ధార్థ్ జోడీకట్టిన దివ్యాన్ష కౌశిక్
  • రెగ్యులర్ స్టోరీ అంటున్న ఆడియన్స్ 
  • కథ ఎంపికలోనే పొరపాటు జరిగిపోయిందని వెల్లడి 
Takkar Movie Update

సిద్ధార్థ్ హీరోగా ఈ నెల 9వ తేదీన 'టక్కర్' సినిమా థియేటర్స్ కి వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ లో కూడా టాక్ మారలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో, సిద్ధార్థ్ జోడీగా దివ్యాన్ష కౌశిక్ నటించింది. ఇక విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ కనిపిస్తాడు. కామెడీ ట్రాక్ ను నడిపించే బాధ్యతను యోగిబాబు భుజాలపై ఉంచారు.

ఈ సినిమా కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేశారు. టైటిల్ కి తగినట్టుగానే యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్స్ ఉన్నాయి. ఇక రొమాంటిక్ సీన్స్ కూడా అప్పుడప్పుడు తెరపైకి వచ్చి వెళుతూనే ఉంటాయి. ఈ సినిమాలో లవ్ ... కామెడీ .. యాక్షన్ .. రొమాన్స్ అన్నీ ఉన్నాయి కదా .. ఇంకా ఏంటి లోపం అనిపిస్తుంది. 

పాత కథ ... పాత పద్ధతిలో నడవడమే ఈ సినిమాకి మైనస్ అయింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇది ఒక రెగ్యులర్ స్టోరీ అంటున్నారు. సిద్ధార్థ్ యాక్టింగ్ .. దివ్యాన్ష గ్లామర్ ఆకట్టుకున్నా, కథలోనే దమ్ములేకపోవడం నిరాశపరిచిందని చెబుతున్నారు. ఈ కథను ఎంచుకోవడంలోనే మేకర్స్ పొరపాటు చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News