Maharashtra: భర్త నుంచి రూ.6 కోట్ల భరణం డిమాండ్ చేసిన మహిళపై కేసు
- విడాకుల కోసం కోర్టుకెక్కిన మధ్యప్రదేశ్ దంపతులు
- భర్త నుంచి భరణం కింద రూ.6 కోట్లు డిమాండ్ చేసిన భార్య
- భార్య తనపై బెదిరింపులకు దిగిందంటూ పోలీసులకు భర్త ఫిర్యాదు
- అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు
భర్త నుంచి రూ.6 కోట్ల భరణం డిమాండ్ చేసిన ఓ మహిళపై మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. భరణం కోసం తనను భార్య బెదిరిస్తోందంటూ భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే, రామ్ రాజ్‌పుత్ దంపతులు విడాకుల కోసం గతంలో కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇటీవల రామ్ రాజ్‌పుత్ భార్య రూ. 6 కోట్లు ఇవ్వాలంటూ భర్తపై బెదిరింపులకు దిగింది. దీంతో, ఆయన భన్వర్‌కువా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ఆయన భార్యపై సెక్షన్ 384, 507, 509 కింద కేసు నమోదు చేశారు.