చెన్నైలో పట్టాలు తప్పిన లేడీస్ కంపార్ట్ మెంట్
- తిరువళ్లూరు వెళుతున్న రైలు
- బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్ వద్ద ఘటన
- హడలిపోయిన ప్రయాణికులు
- ఆ మార్గంలో రైళ్లకు అంతరాయం
అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈఎంయూ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ఇతర రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైల్లోనే ఉన్నవారు, ఒక్కసారిగా రైలు కుదుపులకు గురై ఆగిపోవడంతో హడలిపోయామని చెప్పారు. ఇక ఆ రైల్లో ప్రయాణించడానికి భయపడిన ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే రైలు దిగేసి వెంటనే బస్సెక్కి గమ్యస్థానానికి వెళ్లిపోయాడు.