Vishnu Vardhan Reddy: నిజాలు మాట్లాడితే చాలు... వైసీపీ నానీలు బూతులతో కరిచేందుకు పరుగున వచ్చేస్తారు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy take a jibe at YCP leaders
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న శ్రీకాళహస్తి సభలో వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి జేపీ నడ్డాకు బదులిచ్చారు. ఏపీకి వచ్చి ఎవరో చెప్పిన మాటలను బట్టీ పట్టి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని స్పష్టం చేశారు. బీజేపీ కాస్తా టీజేపీగా మారినట్టు కనిపిస్తోందని, ఏపీలో ఎన్ని చేసినా బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. 

ఈ నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. నిజాలు మాట్లాడితే చాలు... బూతులతో కరిచేందుకు పరుగున వచ్చేస్తారు వైసీపీ నానీలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

"మీరు పనికిమాలిన వాళ్లనే కదా మిమ్మల్ని మంత్రి పదవుల నుంచి పీకేసింది? నోరు చేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరారనే కదా మిమ్మల్ని షెడ్డుకు పంపింది? ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మీరు కూడా మాట్లాడేవారేనా? ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడే ఏముంది... ముందుంది ముసళ్ల పండగ" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Vishnu Vardhan Reddy
Perni Nani
JP Nadda
BJP
YSRCP

More Telugu News