తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ప్రమాదం... బోల్తాపడిన తూఫాన్ వాహనం
- ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లపై తరచుగా ప్రమాదాలు
- నేడు మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
- పలువురికి తీవ్ర గాయాలు
- తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు
ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తుండడం తెలిసిందే. గత మూడు వారాల వ్యవధిలో ఐదు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇటీవల ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఘటనలు జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.