అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందంటే..!

Postmortem report of Apsara
  • ఉస్మానియా యూనివర్శిటీలో పోస్ట్ మార్టం పూర్తి
  • పోలీసులకు ప్రాథమిక నివేదికను అందించిన వైద్యులు
  • తలకు బలమైన గాయం తగలడం వల్లే అప్సర చనిపోయిందన్న వైద్యులు
అప్సరను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె ప్రియుడు సాయికృష్ణ ఆమెను దారుణంగా హతమార్చాడు. అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో కాసేపటి క్రితం పోస్టుమార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య నేతృత్వంలోని బృందం పోస్టుమార్టం నిర్వహించింది. 

పోస్టుమార్టంకు సంబంధించిన ప్రాథమిక నివేదికను వైద్యులు పోలీసులకు అందజేశారు. తలపై బలమైన గాయం తగలడం వల్లే అప్సర చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
Go Back to Shorts
Apsara
Postmortem

More Telugu News