చీప్‌గా అవుటైన వెంటనే ఫుడ్ లాగించేసిన కోహ్లీ.. ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్న అభిమానులు
- 14 పరుగులు మాత్రమే చేసి అవుటైన కోహ్లీ
- 2003 ప్రపంచకప్ ఫైనల్లో త్వరగా అవుటైన సచిన్ మూడు రోజుల వరకు భోజనం ముట్టలేదన్న అభిమానులు
- కోహ్లీ మాత్రం క్షణం కూడా తినకుండా ఉండలేకపోయాడని ఫైర్
‘తినండి, తాగండి, స్నేహితులతో ఎంజాయ్ చేయండి. అభిమానుల గురించి మాత్రం చింతించకండి’ అని ఓ యూజర్ ఫైర్ అయితే, ‘ఐపీఎల్ అసలైన ఐసీసీ ట్రోఫీ అని యువ ఆటగాళ్లకు కోహ్లీ చెబుతున్నాడు’ అని మరో యూజర్ ఆ ఫొటోకు కామెంట్ చేశాడు. 2003 ప్రపంచకప్ ఫైనల్లో త్వరగా అవుటైన సచిన్ మూడు రోజుల వరకు భోజనం ముట్టలేదని, కానీ కోహ్లీ మాత్రం డ్రెస్సింగు రూముకు వచ్చిందే ఆలస్యమన్నట్టు లాంగిచేస్తున్నాడని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.