హైదరాబాదులోనే కాదు.. ఆ ఏడు నగరాల్లోనూ ఇళ్ల ధరలకు రెక్కలు
- జనవరి-మార్చిలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో పెరిగిన ధరలు
- అధికంగా కోల్ కతాలో 11 శాతం పెరుగుదల
- నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గణాంకాల్లో వెల్లడి
హైదరాబాద్ మార్కెట్లో ధరలు 7.9 శాతం మేర పెరిగాయి. కోల్ కతాలో అత్యధికంగా 11 శాతం పెరుగుదల కనిపించగా, తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్ (10.8 శాతం), బెంగళూరు (9.4 శాతం), పూణె (8.2 శాతం) ఉన్నాయి. చెన్నైలో 6.8 శాతం పెరగ్గా, ముంబైలో 3.1 శాతం, ఢిల్లీలో 1.7 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు దేశవ్యాప్తంగా టాప్–50 పట్టణాల్లో ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి.