మృగశిర ఎఫెక్ట్.. కొండెక్కిన కొరమీను ధర!
- చేపల మార్కెట్లకు పోటెత్తిన జనం
- రూ. 600 పలుకుతున్న కొరమీను ధర
- మిగతా చేపల ధరలదీ అదే దారి
- అయినా తగ్గేదేలే అంటూ కొనుగోళ్లు
- హైదరాబాద్‌లో ఇప్పటికే 3 లక్షల కిలోలకు పైగా చేపల విక్రయం
మృగశిర కార్తె రావడంతో ఎండల నుంచి జనానికి ఉపశమనం లభిస్తుంది. అయితే అప్పటి వరకు ఎండను తట్టుకున్న శరీరం ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చేపలు శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోకుండా చేస్తాయి. క్రమంగా సాధారణ స్థితికి తీసుకొచ్చి అనారోగ్యం పాలుకాకుండా కాపాడతాయి. మృగశిర కార్తె తొలి రోజున చేపలు తినాలని చెప్పడం వెనక ఉన్న కారణం ఇదే.