air india: ఆ విమాన ప్రయాణికులకు ఎయిరిండియా బంపరాఫర్!

Air India Apologises Offers Refund To Those Who Were Stranded In Russia
  • రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఎయిరిండియా విమానం 
  • ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా
  • ప్రయాణంలో అసౌకర్యం కలిగినందుకు చింతిస్తూ రిఫండ్ చేస్తున్నామని వెల్లడి
ఢిల్లీ నుండి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఇటీవల రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రత్యేక విమానాన్ని పంపించడంతో ప్రయాణికులు మగడాన్ నుండి గురువారం మధ్యాహ్నం శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎయిరిండియా ఈ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అంతేకాదు, వారికి రిఫండ్ ఆఫర్ ప్రకటించింది.

మిమ్మల్ని శాన్ ఫ్రాన్సిస్కోకు చాలా ఆలస్యంగా తీసుకువెళ్లినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నామని, సాంకేతిక సమస్య రావడంతో ఈ ఇబ్బంది ఎదురైనట్లు ఎయిరిండియా పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశామన్నారు. మిమ్మల్ని తరలించేందుకు మరో ప్రత్యేక విమానం పంపించినప్పటికీ అది కూడా ఆలస్యం అయిందని పేర్కొంది. మీ సహనానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని, గతాన్ని మేం మార్చలేమని, కానీ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఇందుకు గాను మీ ప్రయాణానికి పూర్తి రిఫండ్ ఇస్తామని, భవిష్యత్తులో మా విమానాల్లో ప్రయాణించేందుకు ఓ ట్రావెల్ వోచర్ కూడా ఇస్తున్నామని తెలిపింది.
air india

More Telugu News