magunta: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: మాగుంట రాఘవ రెడ్డికి బెయిల్

  • ఫిబ్రవరి 10న రాఘవను అరెస్టు చేసిన ఈడీ అధికారులు
  • అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదంటూ బెయిల్ పిటిషన్
  • విచారించి మధ్యంతర బెయిల్ ఇచ్చిన స్పెషల్ కోర్టు
magunta raghava reddy gets bail in delhi liquor scam case

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎంపీ మాగుంట రాఘవ రెడ్డికి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదని, తనని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని పేర్కొంటూ రాఘవ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆరు వారాల బెయిల్ ఇవ్వాలని రాఘవ రెడ్డి అభ్యర్థించగా.. కోర్టు రెండు వారాలు బెయిల్ ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు ఫిబ్రవరి 10న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్న రాఘవ రెడ్డి తాజాగా బెయిల్ పై బయటకు రానున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించారని రాఘవపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలో పలు జోన్లకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరోపించింది.

More Telugu News