Siddharth: ఈ వారం థియేటర్స్ కి వచ్చే సినిమాలివే!

  • ఈ నెల 9న థియేటర్ల దగ్గర సందడి 
  • తెలుగు నుంచి 3 చిన్న సినిమాలు 
  • తమిళం నుంచి 'టక్కర్' అనువాదం 
  • హాలీవుడ్ నుంచి బరిలోకి దిగుతున్న మరో మూవీ  
New Movies Update

ఈ శుక్రవారం ఐదు సినిమాలు థియేటర్లకు రానున్నాయి. సముద్రఖని .. అనసూయ .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన 'విమానం' ఈ నెల 9వ తేదీన థియేటర్లకు రానుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో నడవనుంది. రాహుల్ రామకృష్ణ - నవ్య స్వామి జంటగా నటించిన 'ఇంటింటి రామాయణం' కూడా ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేశ్ నారెడ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా, కామెడీ డ్రామా జోనర్లో నడవనుంది. ఇక వీజే సన్నీ హీరోగా రూపొందిన 'అన్ స్టాపబుల్' కూడా ఆ రోజునే ప్రేక్షకులను పలకరించనుంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. సిద్ధార్థ్ హీరోగా నిర్మితమైన 'టక్కర్' ఈ నెల 9వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానుంది. దివ్యాన్ష కౌషిక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, యాక్షన్ - రొమాన్స్ పాళ్లు ఎక్కువగా కనిపించనున్నాయి. ఇక అదే రోజున ఆంగ్లచిత్రం 'ట్రాన్స్ ఫార్మర్స్' - రైజ్ ఆఫ్ ది బీస్ట్స్' తెలుగు డబ్ విడుదల కానుంది.

More Telugu News