ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్
- గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు వద్ద ప్రమాదం
- పంటకాల్వలోకి బోల్తాపడిన ట్రాక్టర్
- ఏడుగురు మహిళల మృతి
- తీవ్ర ఆవేదన కలిగించిందన్న పవన్ కల్యాణ్
శుభకార్యానికి వెళుతున్న బృందం ప్రమాదం బారినపడడం బాధాకరమని వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు.