Amit Shah: చట్టాన్ని తన పని తనని చేయనివ్వండి.. రెజ్లర్లతో అమిత్ షా

Let Law Take Its Course Amit Shah Told Wrestlers
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో కేంద్ర హోంమంత్రి శనివారం అర్ధరాత్రి భేటీ అయ్యారు. తాజాగా ఈ విషయాన్ని ఆందోళన చేస్తున్న రెజ్లర్లలో ఒకరైన బజ్ రంగ్ పూనియా మీడియాకు వెల్లడించారు. రాత్రి 11 గంటలకు మొదలైన ఈ సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగిందని చెప్పారు. భేటీలో తనతో పాటు సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియన్ పాల్గొన్నట్లు పూనియా వివరించారు. అయితే, ఈ భేటీకి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పూనియా నిరాకరించారు. 

అనధికారిక సమాచారం మేరకు.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, లైంగిక వేధింపుల కేసులో వేగంగా చర్యలు తీసుకోవాలని ఈ భేటీలో కేంద్ర హోంమంత్రిని రెజ్లర్లు కోరారు. పలు జాతీయ మీడియాలలో ఈమేరకు కథనాలు ప్రసారమయ్యాయి. చట్టం అందరికీ సమానమేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలని అమిత్ షా రెజ్లర్లకు సూచించినట్లు సమాచారం.
Go Back to Shorts
Amit Shah
Wrestlers
New Delhi
protests
brij bhushan
wrestlers fedaration

More Telugu News