నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం
- నెల్లూరులో ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఘటన
- బైకులపై వచ్చి ఆనంపై కర్రలతో దాడికి యత్నం
- అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
- బైకులు, కర్రలు అక్కడే వదిలి పరారైన వ్యక్తులు
బైకులపై వచ్చిన 10 మంది వ్యక్తులు కర్రలతో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఆ వ్యక్తులు బైకులు, కర్రలు అక్కడే వదిలి పరుగులు తీశారు. వైసీపీ కార్యకర్తలే దాడికి యత్నించారని ఆనం అనుచరులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసినందుకే దాడి చేసేందుకు వచ్చారని ఆరోపించారు.