Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్రెంచ్ ఓపెన్: నాలుగో రౌండ్ కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్

Iga Swiatek rams into fourth round in French Open
Advertisement
  • ఫ్రెంచ్ ఓపెన్ లో ఇగా స్వైటెక్ జోరు
  • 6-0, 6-0తో చైనా అమ్మాయి వాంగ్ జిన్యుపై విజయం
  • గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ లో సింగిల్స్ చాంప్ గా నిలిచిన స్వైటెక్
Advertisement
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో నాలుగో రౌండ్ లోకి దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో స్వైటెక్ అద్భుత ఆటతీరుతో చైనా అమ్మాయి వాంగ్ జిన్యుపై ఘనవిజయం సాధించింది. పోలెండ్ టెన్నిస్ రారాణి స్వైటెక్ 6-0, 6-0తో వరుస సెట్లలో జిన్యును మట్టికరిపించింది. డిఫెండింగ్ చాంప్ స్వైటెక్ విజృంభణ ముందు జిన్యు ఏమాత్రం నిలవలేకపోయింది. కనీసం ఒక్క గేము కూడా గెలవలేకపోయింది. ఇగా స్వైటెక్ గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
Iga Swiatek
French Open
Wang Xinyu
Womens Singles

More Telugu News