మహేశ్ బాబు గుంటూరు కారం గెటప్పులో కోహ్లీ... పిక్ ఇదిగో!

  • ఇటీవల మహేశ్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం టైటిల్ వెల్లడి
  • అదరగొడుతున్న మహేశ్ బాబు మాస్ గెటప్
  • స్టార్ స్పోర్ట్స్ పిక్ లో తలకు కండువా బిగించి కడుతున్న కోహ్లీ
మరో నాలుగు రోజుల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లోని ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో, స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ సోషల్ మీడియాలో ఆసక్తికర పిక్ ను పంచుకుంది. గుంటూరు కారం చిత్రంలో మహేశ్ బాబు గెటప్పులో కోహ్లీ పిక్ ను పోస్టు చేసింది. తలకు కండువా బిగించి కడుతున్న కోహ్లీని స్టార్ స్పోర్ట్స్ పోస్టులో చూడొచ్చు. 

తద్వారా, డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రధాన ఆకర్షణ కోహ్లీయేనని పరోక్షంగా పేర్కొంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు.

Virat Kohli
Mahesh Babu
Guntur Kaaram
WTC Final
Star Sports

More Telugu News