Chiranjeevi: ఆ విధంగా నేను క్యాన్సర్ ముప్పు తప్పించుకున్నాను: చిరంజీవి

Megastar Chiranjeevi talks about cancer
  • హైదరాబాదులో స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి
  • గతంలో ఏఐజీ ఆసుపత్రిలో తనకు కొలనోస్కోపీ చేశారని వెల్లడి
మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదులో కొత్తగా నెలకొల్పిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర అంశం వెల్లడించారు. గతంలో తాను క్యాన్సర్ ముప్పు తప్పించుకున్నానని వెల్లడించారు. 

ఓసారి ఏఐజీ ఆసుపత్రిలో కొలనోస్కోపీ టెస్టు చేయించుకున్నానని, అందులో నాన్ క్యాన్సరస్ పాలిప్స్ ను ముందే గుర్తించి తీసేశారని వెల్లడించారు. దాన్ని గుర్తించకుండా ఉంటే క్యాన్సర్ గా మారేదేమో అని చిరంజీవి పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, హెల్త్ చెకప్ లు చేయించుకుంటుండాలని సూచించారు. ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటే క్యాన్సర్ ను దూరం పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు.


Chiranjeevi
Cancer
Star Cancer Center
Hyderabad

More Telugu News