పెళ్లి గురించి అడిగితే ఘాటుగా స్పందించిన కీర్తి సురేశ్
- కీర్తి పెళ్లి చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం
- తన పెళ్లి గురించి అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించిన కీర్తి
- పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా చెపుతానని అసహనం
ఇక తాజాగా ఓ ప్రెస్ మీట్ లో కీర్తికి ఇదే ప్రశ్న ఎదురయింది. దీంతో ఆమె ఘాటుగా స్పందించింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చానని, అయినా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. తన పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకని అడిగింది. ఈ అంశంపై ప్రతిసారి తనను అడగాల్సిన అవసరం లేదని... తన పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా చెపుతానని అసహనం వ్యక్తం చేసింది.